కలం, వెబ్ డెస్క్ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ (Makthal Municipality) 6వ వార్డుకు జరగాల్సిన ఎన్నికను అధికారులు రద్దు చేశారు. ఈ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహదేవ్ మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహదేవ్ నిన్న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. అతడి మరణానికి రాజకీయ ప్రత్యర్థుల వేధింపులే ప్రధాన కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థి మరణంతో ఆ వార్డులో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ లింగయ్య సందర్శించారు. మృతుడు మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహదేవ్ మృతికి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
Read Also: సీఎం రేవంత్ రెడ్డికి కవిత సవాల్.. ఆ హామీపై చర్చకు సిద్ధమేనా?
Follow Us On : WhatsApp


