epaper
Wednesday, February 18, 2026
epaper

మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక రద్దు

కలం, వెబ్​ డెస్క్​ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ (Makthal Municipality) 6వ వార్డుకు జరగాల్సిన ఎన్నికను అధికారులు రద్దు చేశారు. ఈ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహదేవ్ మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహదేవ్ నిన్న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. అతడి మరణానికి రాజకీయ ప్రత్యర్థుల వేధింపులే ప్రధాన కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థి మరణంతో ఆ వార్డులో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ లింగయ్య సందర్శించారు. మృతుడు మొబైల్​ ఫోన్​ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహదేవ్​ మృతికి తెలంగాణ బీజేపీ చీఫ్​ రామచందర్​ రావు సంతాపం వ్యక్తం చేశారు.

Read Also: సీఎం రేవంత్ రెడ్డికి కవిత సవాల్.. ఆ హామీపై చర్చకు సిద్ధమేనా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>