కలం, సినిమా : నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) రీసెంట్గా అఖండ 2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకొని ఫుల్ ఫామ్లో ఉన్నారు. బాలయ్య తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) డైరెక్షన్లో చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ సినిమా మంచి విజయం సాధించింది. దీనితో మరోసారి ఈ కాంబినేషన్లో మూవీ ఫిక్స్ అయింది. అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యతో ముందుగా హిస్టారికల్ మూవీ చేసేందుకు ప్లాన్ చేసారు. కానీ బడ్జెట్ ఎక్కువవుతుందనే ఉద్దేశంతో ఆ కథను పక్కన పెట్టేసారు.
ప్రస్తుతం బాలయ్యతో పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ లాక్ అయింది. ముంబయి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో బాలయ్య (Balakrishna) పవర్ఫుల్ డాన్ పాత్రలో కనిపించునున్నట్లు సమాచారం. దర్శకుడు గోపీచంద్ ఈ సారి బాలయ్యను మరింత కొత్తగా ప్రెజెంట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Read Also: రామ్ చరణ్ ‘పెద్ది’ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?
Follow Us On: Instagram


