కలం, వెబ్ డెస్క్ : విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్వతంత్ర సంస్థ హైడ్రా (HYDRAA).. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కొండాపూర్లో రూ.700 కోట్ల విలువ గల భూమిని కాపాడింది. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనాగూడ మార్గంలో ఆపరేషన్ నిర్వహించిన హైడ్రా అధికారులు.. స్థానిక జంగమోనికుంట (Jangamonicunta) ప్రాంతానికి చెందిన 4 ఎకరాల భూమిని ఆక్రమించి, మట్టి పోసి ప్లాట్లుగా మార్చి అమ్మకానికి సిద్ధం చేసుకున్న కబ్జాదారులపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా అధికారులు కుంట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భూమిని రక్షించారు. హైడ్రా చర్యలు భూవినియోగంలో అక్రమ కబ్జాలను నిరోధిస్తూ, స్థానికుల హక్కులను రక్షించడంలో కీలక పాత్ర పోషించాయి.
Read Also: ఓం బిర్లా పై అవిశ్వాస బాంబు.. చరిత్ర ఏం చెబుతోంది?
Follow Us On : WhatsApp


