కలం, వెబ్ డెస్క్ : నారాయణపేట (Narayanpet) జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవ్ (BJP Candidate Suicide) అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం వరకు ఎంపీ డీకే అరుణతో కలిసి ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన, రాత్రి కూడా కార్యకర్తలతో కలిసి గెలుపు వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అప్పటి వరకు ఎంతో ధైర్యంగా కనిపించిన మహదేవ్, ఇంతలోనే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం అటు కుటుంబ సభ్యులను, ఇటు పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో అభ్యర్థి మరణించడంతో మక్తల్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రత్యర్థుల వేధింపులే కారణం..
కాంగ్రెస్ నాయకుల వేధింపులు భరించలేక మహదేవ్ ఆత్మహత్యకు (BJP Candidate Suicide) పాల్పడినట్లు మృతిడి బంధువులు ఆరోపిస్తున్నారు. ‘నిన్ను జైలులో వేపిస్తాం అంటూ కాంగ్రెస్ నాయకుల బెదిరించారని, ఫోన్లో మెసేజీలు పెట్టి భయపెడుతున్నారు’ అని తెలిపారు. దీంతో మహదేవ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వారు పేర్కొన్నారు.
Read Also: రేవంత్ రెడ్డికి బిజెపియే దేవుడు : రామచందర్ రావు
Follow Us On: X(Twitter)


