కలం వెబ్ డెస్క్ : హాలీవుడ్ మూవీని తలపించే విధంగా దక్షిణ ఇటలీ (Southern Italy)లో ఓ భారీ దోపిడీ జరిగింది. కోట్లాది యూరోల (Millions of Euros)నగదును తరలిస్తున్న క్యాష్ఇన్ ట్రాన్సిట్ వ్యాన్‌ను ఆయుధాలతో ఉన్న దుండగులు నడిరోడ్డుపైనే అడ్డగించారు. పగటి వేళ హైవేపై ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. వ్యాన్ వెనుక భాగంలో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలను పేల్చుతూ డ్రైవర్, సిబ్బందిని బెదిరించిన దుండగులు.. పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీకి పాల్పడ్డారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే కోట్లాది యూరోల నగదును చోరీ చేసినట్లు ప్రాథమిక సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ పేలుళ్లు, దుండగుల దాడి, రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలు ఇవన్నీ కలసి ఓ యాక్షన్ థ్రిల్లర్ సీన్‌లా కనిపిస్తున్నాయి. చోరీ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇది అంతర్జాతీయ ముఠా పనిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఇటలీ(Southern Italy) వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.


