కలం, డెస్క్ : తీవ్ర అనారోగ్య సమస్యలను జయించి, ఆసియా స్క్వాష్ ఛాంపియన్షిప్ ట్రయల్స్‌లో మెహ్విష్ అలీ (Mehwish Ali) విజయవంతంగా పాల్గొనడం ఇప్పుడు క్రీడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. లక్షలాది మంది క్రీడాకారులకు ఎనలేని స్ఫూర్తినిస్తోంది. ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ స్క్వాష్ ఫెడరేషన్లో జరిగిన 35వ ఆసియా స్క్వాష్ ఛాంపియన్షిప్ ట్రయల్స్‌తో ఆమె అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చింది.
గత నెలలో చెక్ జూనియర్ ఓపెన్ సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మెహ్విష్ (Mehwish Ali) అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే ఆమెను ఐసీయూకు తరలించగా, ఆక్సిజన్ లోపం కారణంగా గుండెపై ఒత్తిడి ఏర్పడి దాదాపు ఏడు గంటల పాటు స్పృహ కోల్పోయినట్లు వైద్యులు గుర్తించారు. ఇలాంటి తీవ్ర అనారోగ్య పరిస్థితి నుంచి మెహ్విష్ పూర్తిగా కోలుకోవడంతో పాకిస్థాన్ స్క్వాష్ వర్గాల్లో ఊరట వ్యక్తమైంది. కోలుకున్న తర్వాత ఆమె తిరిగి శిక్షణ ప్రారంభించి, తన సిస్టర్స్ తో కలిసి ట్రైనింగ్ కంటిన్యూ చేసింది. తర్వాత ఆసియా ఛాంపియన్షిప్ ట్రయల్స్‌ను కూడా పూర్తి చేసింది.
ఈ ట్రయల్స్‌ను మెహ్విష్ కేవలం పోటీగా కాకుండా, క్రీడాకారిణిగా ఎదగడానికి, ఆసియా స్థాయిలో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశంగా చూశానని మెహ్విష్ తెలిపింది. పేశావర్‌కు చెందిన అలీ సోదరీమణులు మెహ్విష్, సెహ్రిష్, మహ్నూర్ ఇటీవల అంతర్జాతీయ జూనియర్ స్క్వాష్ వేదికపై నిలకడైన ప్రదర్శనలతో గుర్తింపు పొందుతున్నారు.
Read Also: భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ అంగీకారం
Follow Us On : WhatsApp


