కలం, నల్లగొండ బ్యూరో : కోదాడలో ఈడీ ఆకస్మిక సోదాలు (ED Raids) జరిపింది. కిట్స్ కాలేజీ చైర్మన్, రైసుమిల్లు వ్యాపారి నీలా సత్యనారాయణ ఇంట్లో సోమవారం ఈడీ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. ఏకకాలంలో ఆరు చోట్ల దాడులు చేశారు. కోదాడలోని రైసుమిల్లుతో పాటు, కిట్స్ కాలేజీ, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు, సీఎంఆర్ బియ్యం ఎగ్గొట్టడం, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు లోన్లు తీసుకోవడంతో పాటు ఇతర కారణాల నేపథ్యంలో ఈడీ సోదాలు చేసి వివరాలను ఆరా తీస్తోంది. సోదాలపై ఈడీ అధికారులను వివరణ కోరే ప్రయత్నం చేయగా.. తనిఖీలు కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. గతంలో సీఎంఆర్ రైస్ వ్యవహారంలో నీలా సత్యనారాయణ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
Read Also: తొలి అంధ మహిళా జడ్జిగా తాన్యా నాథన్!
Follow Us On: Sharechat


