epaper
Wednesday, February 18, 2026
epaper

మధిర ప్రజలకు డిప్యూటీ సీఎం కీలక హామీ

కలం/ఖమ్మం బ్యూరో: మధిర నియోజకవర్గ ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలకహామీ ఇచ్చారు. మధిర ప్రజలకు ఏ కష్టమొచ్చినా, ఏ అవసరం వచ్చినా తీరుస్తానని భట్టి హామీ ఇచ్చారు. సోమవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. మధిరను రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తిద్దుతానన్నారు. ‘రాజకీయాలు కాదు అభివృద్ధి కావాలి, మధిర ప్రజలకు ఏ అవసరం వచ్చినా నేను సిద్ధంగా ఉంటాను’ అంటూ భట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇది ఒక అంది వచ్చిన అవకాశం, మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే మధిర పట్టణ అభివృద్ధికి అవకాశం లభిస్తుందని డిప్యూటీ సీఎం అన్నారు.

బీఆర్ఎస్ పాలనలో అన్యాయం

‘గత పదేండ్లు రాష్ట్రంలో అధికారంలో లేము. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిధులు మంజూరు చేయలేదు. మున్సిపాలిటీ పాలకవర్గం కూడా కాంగ్రెస్ చేతిలో లేకపోవడంతో వారు అభివృద్ధి చేయలేకపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదృష్టవశాత్తు నేను డిప్యూటీ సీఎం గా ఉన్నాను. ప్రత్యేకంగా తాను ఆర్థిక, విద్యుత్తు, ప్రణాళికశాఖలు చూస్తున్నానని మధిర పట్టణ అభివృద్ధికి ఇది ఒక చక్కని అవకాశం’ అని భట్టి (Bhatti Vikramarka) తెలిపారు.

మధిర అభివృద్ధికి అనుమతులు

‘మధిర (Madhira) సమగ్ర అభివృద్ధికి అనేక రకాల పనులకు అనుమతులు వచ్చాయి. ఆ పనులన్నీ చక్కగా ప్రణాళికా ప్రకారం నిరుపయోగం కాకుండా పూర్తి చేయాలంటే మంచి పాలకవర్గం ఉండాలి. అందుకే అన్ని విధాల ఆలోచించి బరిలో దింపిన కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించండి’ అంటూ భట్టి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పట్టణంలోని అన్ని వర్గాల నుంచి రాజకీయాలకు అతీతంగా ప్రముఖులను ఎంపిక చేసి మధిర పట్టణ అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసి వారి సలహా సూచనలతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం ఎన్ని వేలకోట్లయినా ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చారు. వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి పరిశ్రమలు ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఇండస్ట్రియల్ పార్కులో వారికి ప్రత్యేకంగా స్థలాలు కేటాయిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి “మధిర పట్టణం మనది” అన్న భావనతో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

అభివృద్ధి ఆగొద్దు : భట్టి

మధిర పట్టణ ఓటర్ల అమూల్యమైన ఓటు వృధాగా పోనివ్వను మధిర పట్టణ అభివృద్ధి ఎందుకు ఆగుతుందో చూద్దామని, మధిర పట్టణ అభివృద్ధి రథం ఆగదన్నారు. మధిర మనది మీరందరూ కలిసి వరుసగా నాలుగు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి పంపారు డిప్యూటీ సీఎం గా, ఆర్థిక మంత్రిగా అవకాశం దక్కింది ఈ అవకాశాన్ని అభివృద్ధికి ఉపయోగించుకుందాం అని తెలిపారు. తాను తీసుకువచ్చిన నిధులు క్షేత్రస్థాయిలో సక్రమంగా ఖర్చు చేసేందుకు, నాణ్యతతో పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కూటమి పక్షాన అన్ని ఆలోచించి నిలబెట్టిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం ఓటర్లను కోరారు. రాష్ట్రంలోని వనరులు, సంపద ప్రజలకు పంచే కార్యక్రమం ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.

విద్యార్థుల కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్

చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం నైపుణ్యం ఆధారిత పాలిటెక్నిక్ కళాశాల, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మదిరలో ఏర్పాటు చేశామని తెలిపారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల భవన నిర్మాణాలు చేపట్టామన్నారు. పోటీ పరీక్షల కోసం మన బిడ్డలు హైదరాబాద్కు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం మధిర డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలోనే ఉత్తమ ఉపాధ్యాయులతో ఆన్లైన్లో పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నామని తెలిపారు.

భారీ వరదలు వస్తే మధిర పట్టణంలోకి నీరు రాకుండా ఏటి పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని రాయపట్నం బ్రిడ్జి నుంచి రైల్వే బ్రిడ్జి వరకు భారీ రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి అని తెలిపారు. సాయంత్రం వేళ కుటుంబంతో వెళ్లి ప్రశాంతంగా గడిపేందుకు ఏటి పొడవునా వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈదురు గాలులు భారీ వర్షం వచ్చిన రెప్ప పాటు కరెంటు పోకుండా ఉండేందుకు అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ద్వారా కరెంటు సరఫరా అయ్యే వ్యవస్థను నెలకొల్పుతున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

 Read Also: యాదాద్రి జిల్లాలో డాక్టర్ అవతారం ఎత్తిన దోపిడి దొంగ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>