epaper
Wednesday, February 18, 2026
epaper

యూఎస్ఏ మ్యాచ్‌లో భారత్ ఆటపై గంగూలీ రియాక్షన్ ఇదే..!

కలం, వెబ్ డెస్క్ : యూఎస్ఏ (USA)తో జరిగిన మ్యాచ్‌లో భారత్ (India) ఆటపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్పందించాడు. టీ20 క్రికెట్‌లో దూకుడు తప్పనిసరి అని స్పష్టం చేశారు. క్లిష్టమైన పిచ్‌లపై కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తమ సహజ ఆటను కొనసాగించాలని సూచించారు. ఆ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిందని గుర్తుచేశారు. అయినా చివరికి పోరాట స్కోరు సాధించగలిగిందని చెప్పారు. ఈ తరహా రిస్క్‌ తీసుకోవడమే ఆధునిక టీ20 ఆట స్వభావమని అభిప్రాయపడ్డారు. నిరంతరం దూకుడుగా ఆడితే కొన్ని మ్యాచ్‌లలో విఫలం కావడం సహజమని గంగూలీ తెలిపారు.

ఆటగాళ్లు చాలా కాలంగా ఇదే శైలిలో ఆడుతున్నారని, అప్పుడప్పుడూ తప్పిదాలు జరగడం సహజమేనని పేర్కొన్నారు. భారత్ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌, స్పిన్‌, ఫీల్డింగ్‌ అన్నింటిలో సమతుల్యంగా ఉందని ప్రశంసించారు. టోర్నమెంట్ ముందుకు సాగేకొద్దీ జట్టు మరింత రిథమ్‌లోకి వస్తుందని తెలిపారు. భారత్ ఈ వరల్డ్ కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా నిలుస్తుందని, ఓడించడం అంత సులువు కాదని గంగూలీ (Sourav Ganguly) అభిప్రాయపడ్డారు.

 Read Also: భారత్ మ్యాచ్‌పై కౌంట్‌డౌన్.. పీఎంతో పాక్ టీమ్ భేటీ..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>