epaper
Wednesday, February 18, 2026
epaper

కొమురంభీం జిల్లాలో మావోయిస్టుల క‌ల‌క‌లం!

క‌లం, వెబ్ డెస్క్‌: కొమురంభీం ఆసిఫాబాద్ (Komaram Bheem Asifabad) జిల్లాలో మావోయిస్టుల సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. మ‌హారాష్ట్ర‌లోని గ‌డ్చిరోలి నుంచి ఓ ద‌ళం జిల్లాలో ప్ర‌వేశించిన‌ట్లు చ‌ర్చ న‌డుస్తోంది. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆసిఫాబాద్‌, తిర్యాణి మండ‌లాల్లో కూంబింగ్ నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు గ్రే హౌండ్స్ బ‌ల‌గాలు డోర్లి, పంగిడి మాదారం అడ‌వుల్లో మావోయిస్టు (Maoist)ల సామ‌గ్రి గుర్తించారు. దీంతో అనుమానాల‌కు మ‌రింత బ‌లం చేకూరింది. ఇటీవ‌ల గ‌డ్చిరోలిలో భారీ ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. ఈ క్ర‌మంలో మావోయిస్టులు అక్క‌డి నుంచి జిల్లాకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ఎక్క‌డిక‌క్క‌డ త‌నిఖీలు చేప‌డుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>