epaper
Wednesday, February 18, 2026
epaper

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: ఇటీవల నాంపల్లిలో జరిగిన ఫొరెన్సిక్ ల్యాబ్ (Nampally FSL) అగ్ని ప్రమాదంపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)  ఆరోపించారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను ధ్వంసం చేసేందుకే ఆ కార్యాలయాన్ని తగలబెట్టి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడైనా చలికాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అగ్ని ప్రమాదంపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని.. వెంటనే సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఆదివారం ఆయన (KTR) వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పోలీసులు ప్రైవేట్‌ఆర్మీగా పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. అగ్ని ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరపాలని కోరారు.  ఓటుకు నోటు కేసు విచారణ చివరిదశకు చేరుకోవడంతో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆధారాలను ధ్వంసం చేశాడని కేటీఆర్ ఆరోపించారు. నాంపల్లిలో జరిగింది ముమ్మాటికి అగ్ని ప్రమాదం కాదన్నారు.  ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గణనీయమైన స్థానాలను గెలుచుకుంటుందని చెప్పుకొచ్చారు.

Read Also: మున్సిపోల్స్ రిజల్ట్.. కేటీఆర్‌కు ‘ఇజ్జత్ కా సవాల్’

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>