కలం, డెస్క్ : బీజేపీ, బీఆర్ ఎస్ వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒక్కటే అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను సీబీఐ, ఈడీ కేసులతో వేధించిన బీజేపీ ప్రభుత్వం.. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి చేసిన కేసీఆర్ పై సీబీఐ విచారణ ఎందుకు వేయట్లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ప్రతిపాదనలు పంపించి ఆరు నెలలు అవుతోంది. ఎందుకు వేయట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) వేల కోట్లు దోచుకున్నారని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. మరి ఇప్పుడు ఏమైంది. కేటీఆర్ పై ఈ కార్ రేసు కేసు విషయంలో సీబీఐ విచారణ ఎందుకు వేయట్లేదు. కేసీఆర్, కేటీఆర్ లను బీజేపీ కాపాడుతోంది. కనీసం విచారణకు పిలవట్లేదు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిజాలు బయటపెట్టకుండా దాటేస్తున్నారు.. ఆయన కల్వకుంట్ల కుటుంబ మనిషిగా మారిపోయారు’ అంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు.
బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో ఎన్నో అక్రమాలు, అవినీతి పనులు చేశారని.. అందులో ఫోన్ ట్యాపింగ్ కూడా ఉందన్నారు సీఎం రేవంత్ (Revanth Reddy). ‘ఫోన్ ట్యాపింగ్ ద్వారా భార్య, భర్తల మాటలు విన్నారు. ప్రతిపక్ష లీడర్లు, జర్నలిస్టులు, వ్యాపారస్తులు, సెలబ్రిటీలను వేధించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా మంది వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేసి.. వేల కోట్ల బాండ్లను రాయించుకున్నారు. బీఆర్ ఎస్ అంటేనే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి. బీఆర్ ఎస్ పార్టీ బీజేపీ కోసం పనిచేస్తోంది. మొన్న పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలను బీఆర్ ఎస్ వాళ్లే గెలిపించారు. ఈ ఎన్నికల్లో అలాంటి కుట్రలే చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ నేతలు అలర్ట్ గా ఉండాలి. ఈ భూపాలపల్లి జిల్లా మీద కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. దెబ్బకు దెబ్బ కొడుదాం. ఎత్తుకు పైఎత్తు వేద్దాం. కేసీఆర్, అమిత్ షా, ప్రధానమంత్రినరేంద్ర మోడీ వచ్చినా సరే ఈ ఎన్నికల్లో మనదే విజయం’ అంటూ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
Read Also: ఢిల్లీ చేరిన కవిత ఫైల్స్.. మూడు నెలల్లో కొలిక్కి…
Follow Us On: Youtube


