కలం, వెబ్డెస్క్: అమెరికాకు చెందిన ఫైనాన్షియర్ ఎప్స్టీన్ (Jeffrey Epstein).. మహిళలు, ముఖ్యంగా మైనర్ బాలికలను పావుగా చేసి నడిపిన ‘సెక్స్ స్కాండల్’ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు, శ్రీమంతులు, రాజకుటుంబీకులు, కళాకారులు, క్రీడాకారుల నిజస్వరూపాలను బయటపెట్టింది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ ఎప్స్టీన్ ఫైల్స్ సెగ దలైలామా (Dalai Lama) కార్యాలయాన్నీ తాకింది.
ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్ గురించి ఇటీవల అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన లక్షలాది ఆడియోలు, వీడియోలు, పత్రాల్లో దలైలామా పేరుందని వచ్చిన వార్తలపై ఆయన కార్యాలయం స్పందించింది. ఈ ప్రచారం అబద్ధమని ఖండించింది. ఈ మేరకు వివరణ ఇస్తూ దలైలామా ‘ఎక్స్’ అకౌంట్లో ట్వీట్ చేసింది (Dalai Lama). అందులో ఏముందంటే..
‘ఎప్స్టీన్ ఫైల్స్ (Epstein Files) కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో దలైలామాకు లింకులు కలుపుతూ ఇటీవల మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం. గౌరవ దలైలామా ఎప్పుడూ ఎప్స్టీన్ను గానీ, అతని తరఫు మనుషులను గానీ కలవలేదు. దలైలామా తరఫున కూడా ఎవరూ ఎప్స్టీన్తో సమావేశం కాలేదు’ అని ఆ ట్వీట్లో స్పష్టం చేసింది.
Read Also: భూపాలపల్లి జిల్లాను రద్దు చేయం : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram


