కలం, డెస్క్ : కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో (Choppadandi Municipality) జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మున్సిపాలిటీల్లో పన్నులు పెంచుతారని.. రెండేళ్లుగా ఎలాంటి నిధులు ఇవ్వకుండా చొప్పదండిని గాలికొదిలేశారంటూ విమర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో మూడేళ్లు ఉంటుందని.. కాబట్టి హస్తం గుర్తుకు ఓటేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి రెండేళ్లుగా మున్సిపాలిటీలను ఎందుకు అభివృద్ధి చేయలేదు. ఎలాంటి డెవలప్ మెంట్ లేకుండా నాశనం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్.
సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి తన దగ్గర డబ్బుల్లేవని పదే పదే చెబుతున్నారని.. అలాంటి వ్యక్తి మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారని బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. కమలం గుర్తుకు ఓటేస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి చొప్పదండిని గెలిపించుకునే బాధ్యత తనదేనని బండి సంజయ్ అన్నారు. తమకు మున్సిపాలిటీల్లో ఎలాంటి పదవులు లేకపోయినా ఇన్ని నిధులు తీసుకొస్తున్నామని.. ఒకవేళ ఓటేసి చైర్మన్ పదవి గెలిపిస్తే.. నిధులు పక్కదారి పట్టకుండా అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ అన్నారు. బీఆర్ ఎస్ పార్టీ రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో లేదని.. అలాంటి పార్టీకి ఓటేసినా ఎలాంటి అభివృద్ధి జరగదన్నారు బండి సంజయ్.
Read Also: టీ20 వరల్డ్ కప్ 2026 : టాప్ స్కోరర్లు వీరే
Follow Us On: Youtube


