epaper
Wednesday, February 18, 2026
epaper

ఫైర్ యాక్సిడెంట్‌పై బీఆర్ఎస్ విష ప్రచారం

కలం, వెబ్ డెస్క్: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ (Nampally FSL) అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar) మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ అగ్ని ప్రమాదంతో సంబంధం ఉందని బీఆర్ఎస్ ఆరోపించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. శనివారం ఉదయం నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘వోట్ ఫర్ నోట్’ కేసుకు సంబంధించిన ఆధారాలను నాశనం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ఘటన జరిగినదని ఆయన ఆరోపణల్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్‌లను కప్పిపుచ్చడానికి ఈ ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.

దీనిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar) తీవ్రంగా స్పందించారు. కేటీఆర్‌పై విమర్శలు గుప్పించిన ఆయన, “నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ముడి పెట్టడం ఏంటి?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్ల దరిద్రపు పాలనను ప్రజలు మరిచిపోతారా? “ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనలో ఏదైనా కుట్ర ఉంటే అది మీ బీఆర్ఎస్ తరఫు నుంచే జరిగి ఉండాలి” అని విమర్శించారు.

Read Also: మున్సిపోల్స్ రిజల్ట్.. కేటీఆర్‌కు ‘ఇజ్జత్ కా సవాల్’

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>