కలం, మెదక్ బ్యూరో : ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టడానికి మద్యం, మాంసం, చీరలు పంపిణీనే ఇప్పటి వరకు చూసాం.. కానీ అవి మాత్రమే ఇస్తే ఓట్లు వేస్తారో లేదో అని ఆలోచించాడో లీడర్. గజ్వేల్ (Gajwel Elections) లో పోటీ చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి మాత్రం గెలవడానికి కొత్తగా ఆలోచించాడు. తన వార్డు ఓటరుమహశయులా కోసం మందు దాంట్లోకి స్టఫ్ గా చిప్స్ పాకెట్స్, మందు తాగని వారి కోసం థమ్స్ అప్, మాజా బాటిల్స్ సిద్ధం చేశాడు.
మహిళా ఓట్లు కూడా కీలకం గనుక వారి కోసం నిత్యవసర సరుకులైన సబ్బులు, సర్ఫ్ పాకెట్స్, ఫ్లోర్, బాత్ రూం క్లీనింగ్ లిక్విడ్స్.. ఇలా ఒక పద్ధతి ప్రకారం సంచిలో పెట్టీ పంచడానికి సిద్ధం చేశారు. పంచె ఐటమ్ లిస్ట్ ప్లానింగ్ లో చేసుకున్నంతా జాగ్రత్త.. దాన్ని పంచడానికి మాత్రం చేసుకోలేదు. ఫలితంగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా గజ్వెల్ (Gajwel Elections) పట్టణంలో 2వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి గోలి మమత సంతోష్ కి చెందిన ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉంచిన భారీ మద్యం, నిత్యావసర సరుకులను సీజ్ చేశారు ఎఫ్ఎస్టి టీం. గజ్వేల్ వాసవి నగర్ లోని ఓ ఇంట్లో పంచడానికి సిద్ధంగా ఉన్న వస్తువులను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.
Read Also: ఫైర్ యాక్సిడెంట్‌పై బీఆర్ఎస్ విష ప్రచారం
Follow Us On: Instagram


