epaper
Wednesday, February 18, 2026
epaper

మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కిన వ్యక్తి

కలం, మెదక్ బ్యూరో : తాగిన మైకంలో ట్రాన్స్ ఫార్మర్ పైకెక్కి.. కరెంట్ తీగలను పట్టుకోవడంతో వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన సంగారెడ్డి జిల్లా (Sangareddy)లో చోటుచేసుకుంది. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ ODF కాలనీలో మద్యం మత్తులో నర్సింహులు అనే వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ పైకెక్కి, విద్యుత్ వైర్లను పట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి కిందపడి, తీవ్రంగా గాయపడ్డాడు.

ట్రాన్స్ ఫార్మర్ ను ముట్టుకోవడంతో తీవ్రంగా గాయపడిన నర్సింహులు ను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: పంచుదాం అనుకున్నారు.. పట్టుబడ్డారు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>