epaper
Wednesday, February 18, 2026
epaper

ఫిబ్ర‌వ‌రి 28న వరంగల్‌లో రాకెట్ లాంచింగ్

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఈ నెల 28న వరంగల్ వేదికగా రుద్రమ (Rudrama) పేరుతో రూపొందించిన రాకెట్ లాంచింగ్ (Rocket Launch) జరుగనుంది. సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇస్రో స్పేస్ ట్యూటర్ ఏటీడీఆర్ఎల్ (అన్సియంట్ టెక్నాలజీస్ డిజైన్ అండ్ రీసెర్చ్ ల్యాబ్) కంపెనీ వ్యవస్థాపకుడు శశాంక్ భూపతి నేతృత్వంలో ఈ ప్ర‌క్రియ జ‌రుగ‌నుంది. వరంగల్ నిట్, కుడా (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్) సహకారంతో నిర్వ‌హించ‌నున్నారు.

మొదటిసారిగా హనుమకొండ హయాగ్రీవచారి మైదానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సైన్స్ అంతరిక్షంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఆ తర్వాత రుద్రమగా నామకరణం చేసిన మోడల్ రాకెట్‌ను ఆకాశంలోకి పంపనున్నారు. ఈ మేరకు శనివారం నిట్ డైరెక్టర్ బీద్యాధర్ సుబుది, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ భాజపాయ్, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి పోస్టర్ ఆవిష్కరించారు.

Warangal Rocket Launch
Warangal Rocket Launch

Read Also: అగ్ని ప్ర‌మాదంలో ఆ కేసు ఫైళ్లు లేవు : శిఖా గోయ‌ల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>