epaper
Wednesday, February 18, 2026
epaper

మ‌లేషియాలో ఘ‌న స్వాగ‌తం.. ఎక్స్ వేదిక‌గా ఫోటోలు షేర్ చేసిన మోడీ

క‌లం, వెబ్ డెస్క్‌: మ‌లేషియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ(PM Modi)కి పుత్రజయలో ఉన్న ప్రధాని కార్యాలయం పెర్డానా పుత్రలో ఘన స్వాగతం ప‌లికారు. ఈ సందర్భంగా జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. భారత్–మలేషియా మధ్య ఉన్న బలమైన స్నేహబంధం, పరస్పర నమ్మకం, ఉమ్మడి ఆశయాలపై ఆధారపడి ఇరు దేశాల భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ భేటీ ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు కొత్త దశకు చేరుకుంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మలేషియా(Malaysia) ప్రధాని అన్వర్ ఇబ్రహీం కూడా పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, వాణిజ్య సంబంధాలతో పాటు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే తిరుమురైలో మలేషియా హిందూ సొసైటీకి చెందిన విద్యార్థుల బృందం భక్తి గీతాలను పఠించడంపై మోడీ ప్ర‌శంస‌లు కురిపించారు. మలేషియాలోని తమిళ సమాజం చాలా ఏళ్లుగా వారసత్వాన్ని కాపాడుతుండటం చాలా గొప్ప విష‌య‌మ‌ని పేర్కొంటూ దీనికి సంబంధించిన వీడియో షేర్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>