Mobile Popup Ad
Mobile Popup Ad

హర్యానాలో ఘోర ప్రమాదం.. విరిగిపడ్డ స్వింగ్..

కలం, డెస్క్ : హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. ఫరీదాబాద్ లోని సూరజ్ కుండ్ (Surajkund)లో జరిగిన ఫెయిర్ లో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఫెయిర్ లో సునామీ స్వింగ్ అనే జెయింట్ వీల్ సడెన్ గా విరిగి పడింది. ప్రమాద సమయంలో స్వింగ్ మీద ఉన్న 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లారు. స్వింగ్ కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లిన ఓ ఇన్ స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా ట్రీట్ మెంట్ పొందుతూ చనిపోయారు.

ఈ సునామీ స్వింగ్ విరిగి పడిపోవడంతో.. ఎంట్రెన్స్ గేట్ వద్ద ఉన్న స్వాగత ద్వారం కూడా కుప్పకూలింది. ఈ ఘటనలో (Surajkund) ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు ఘటనల్లో గాయపడ్డ వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో స్వింగ్ మీద చాలా మంది ఉండటంతో.. తీవ్రత ఎక్కువగా ఉంది.

Read Also: ఆర్​ఎస్​ఎస్​ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న సల్మాన్​ ఖాన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>