కలం, వెబ్‌డెస్క్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు (Salman Khan – RSS). ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ‘హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సంఘ్ జర్నీ : న్యూ హారిజోన్స్) పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముంబైలోని నెహ్రూ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు (ఫిబ్రవరి7, 8న) ‘వ్యాఖ్యన్మాల’ పేరుతో ఉపన్యాసాల కార్యక్రమం ప్రారంభించారు. దీనికి మొదటి రోజు శనివారం సల్మాన్ ఖాన్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన రణబీర్ కపూర్, డైరెక్టర్ సుభాష్ ఘాయ్, సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషి కూడా హాజరయ్యారు. అలాగే దాదాపు 900 మంది వరకు ప్రముఖులు, ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు.
‘విశ్వగురు’ ఆధిపత్యంతో కాదు.. : మోహన్ భగవత్
కార్యక్రమంలో (Salman Khan – RSS) ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ ఆధిపత్యం ద్వారా కాకుండా అంతర్గతంగా మార్గనిర్దేశం చేస్తూ, ఆదర్శంగా నిలుస్తూ ‘విశ్వగురు’గా ఎదగాలని చెప్పారు. ‘విశ్వగురుగా మారాలంటే కఠినమైన శ్రమ అవసరం. వ్యక్తిత్వ నిర్మాణం, సామాజిక వ్యవస్థీకరణ అవసరం. ఆధిపత్యం ద్వారా ఇది సాధ్యం కాదు. ధర్మం సర్వ జీవనానికి ఆధార శక్తిగా భారత్‌ను నడిపిస్తుంటే, ఆ పాత్రను కొనసాగిస్తూ ప్రపంచాన్ని ఉన్నత స్థితికి భారత్ తీసుకెళుతుంది’ అని భగవత్ పేర్కొన్నారు.
ధర్మం అంటే కేవలం మతం మాత్రమే కాదని భగవత్ (Mohan Bhagwat) స్పష్టం చేశారు. ధర్మం అనేది సమస్త జీవనాన్ని నిలబెట్టే సార్వత్రిక నియమావళి అని అన్నారు. ఈ సందర్భంగా సంఘ్ పరివార్ ఎవరికీ వ్యతిరేకం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఏ సంఘటనకు ప్రతిస్పందనగా కూడా సంఘ్ పని చేయదని, దేశంలో ఇప్పటికే కొనసాగుతున్న సానుకూల ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం, మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని భగవత్ తెలిపారు.
Read Also: బూతులు మాట్లాడేవారికి ప్రజలే బుద్ధిచెప్పాలి : వెంకయ్య నాయుడు
Follow Us On: Youtube


