epaper
Tuesday, November 18, 2025
epaper

బీహార్ సీఎంగా నితీశ్ రాజీనామా..

బీహార్(Bihar) రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి జేడీయూ అధినేత నితీశ్ కుమార్(Nitish Kumar) రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం.. రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌(Arif Mohammad Khan)ను రాజ్‌భవన్‌లో కలిసి తన రాజీనామా లేఖను అందించారు. కాగా ఆయన రాజీనామా లేఖను స్వీకరించిన గవర్నర్.. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని నితీశ్‌(Nitish Kumar)ను కోరారు. కాగా అందుకు నితీశ్ తన సమాధానం ఏమీ చెప్పలేదు. ఆయన తిరస్కరిస్తే.. ఆయన స్థానంలో ఆపద్ధర్మ సీఎంగా వేరే వారిని నియమించాల్సి ఉంటుంది.

అయితే ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ఘటన విజయం సాధించింది. ఈ ఎన్నికలో మొత్తం 243 స్థానాల్లో ఎన్‌డీఏ 202 స్థానాలను సొంతం చేసుకుంది. ఈ ఎన్నికలో బీజేపీ 89, జేడీయూ, ఎల్‌జేపీ(ఆర్‌వీ) 19, హెచ్‌ఏఎంఎస్ 5, ఆర్ఎల్‌ఎం 4 సీట్లు గెలిచారు.

Read Also: ఢిల్లీలో సిద్దరామయ్య, డీకే.. సీఎం మార్పు ఉంటుందా?

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>