epaper
Wednesday, February 18, 2026
epaper

అంబటి రాంబాబుపై ఏపీ వ్యాప్తంగా 36 కేసులు.. ఇప్పట్లో బెయిల్ కష్టమేనా..?

కలం, డెస్క్ : మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై (Ambati Rambabu) ఏపీ వ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబుపై (Chandrababu) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై నమోదైన కేసులో ఇప్పటికే గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబుపై 36 కేసులు నమోదవడం సంచలనంగా మారింది.

వరుసగా కేసులు

ఈ కేసుల్లో కూడా అంబటి రాంబాబును ఆయా స్టేషన్ల పోలీసులు అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. వారు కూడా కోర్టుల్లో అంబటి రాంబాబును ప్రవేశ పెడితే.. బెయిల్ రావడం మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. గతంలో వల్లభనేని వంశీతో పాటు పోసాని కృష్ణ మురళిపై ఇలాగే పెద్ద ఎత్తున వరుస కేసులు నమోదవడంతో.. కొన్నింటిలో బెయిల్ వచ్చినా.. మిగతా కేసుల్లో బెయిల్ రాక జైల్లోనే గడపాల్సి వచ్చింది. చూస్తుంటే ఇప్పుడు అంబటి రాంబాబుకు ప్రస్తుతం జైల్లో ఉన్న కేసులో బెయిల్ వచ్చినా.. ఆ వెంటనే మిగతా కేసుల్లో బెయిల్ రాకపోతే జైల్లోనే ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి.

ముందస్తు బెయిల్ కోసం..

ప్రస్తుతం అంబటి రాంబాబుపై (Ambati Rambabu) నమోదైన కేసుల్లో ముందస్తు బెయిట్ కోసం ఆయన తరఫున లాయర్లు పిటిషన్లు వేస్తున్నారు. కేసులు పెట్టింది మొత్తం టీడీపీ నేతలే కావడంతో.. ఉపసంహరించుకునే ఛాన్స్ లేదు. త్వరలోనే అంబటి రాంబాబును మిగతా స్టేషన్ల పోలీసులు తమకు అప్పగించాలని జైలు అధికారులను కోరేందుకు రెడీ అవుతున్నారు. అటు వైసీపీ లీగల్ సెల్ తో పాటు అంబటి ఫ్యామిలీ బెయిల్ కోసం తీవ్రంగానే కష్టపడుతున్నారు.

టీడీపీ ఆగ్రహం..

అంబటి రాంబాబుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఇప్పటికే మాజీ సీఎం జగన్ (YS Jagan) హామీ ఇచ్చారు. అంబటి రాంబాబు వ్యవహారంపై టీడీపీ చాలా సీరియస్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఒక సీఎంను పట్టుకుని బూతులు తిట్టిన అంబటి రాంబాబును వదిలే ప్రసక్తేలేదని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇంకోవైపు అంబటి రాంబాబు కూతుర్లు మీడియా ముందుకొచ్చి టీడీపీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా దాడి చేశారంటూ వాపోతున్నారు. ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నా.. అంతిమంగా ఈ కేసుల్లో అంబటికి బెయిల్ వచ్చేదాకా జైల్లో ఉండక తప్పని పరిస్థితులు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read Also: అమరావతి క్వాంటమ్ వ్యాలీ దేశానికే గర్వకారణం : సీఎం చంద్రబాబు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>