epaper
Wednesday, February 18, 2026
epaper

షార్ట్​ సర్క్యూట్​ వల్లే నాంపల్లి ఎఫ్ఎస్​ఎల్​ అగ్ని ప్రమాదం : ఫైర్ డీజీ విక్రమ్​ సింగ్​

కలం, వెబ్​ డెస్క్​ : నాంపల్లి (Nampally) లోని ఎఫ్ఎస్​ఎల్ (FSL)​ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలను ఫైర్​ డీజీ విక్రమ్ సింగ్​ (Fire DG Vikram Singh) వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీ మీడియాతో మాట్లాడారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్​ కారణం అని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్లు, ప్రింటర్లు, హార్డ్​ డిస్క్​ లు మొత్తం కాలిపోయాయన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రెసిడెన్షియల్​, కమర్షియల్​, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైర్​ సేఫ్టీ బృందాలు తనిఖీలు చేపడుతోందని వెల్లడించారు.

వేసివి కాలం వస్తున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండడం వల్ల అప్రమత్తంగా ఉన్నామని డీజీ విక్రమ్​ సింగ్​ వెల్లడించారు. కాగా, నాంపల్లి (Nampally) లోని తెలంగాణ ఎఫ్​ఎస్​ఎల్ (FSL)​కార్యాలయంలో ఉన్న ల్యాబ్ లో శనివారం మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పినట్లయింది. అయితే, ఇదే భవనంలో ఫోన్​ ట్యాపింగ్​ కి సంబంధించిన కీలక ఫైళ్లు ఉన్నట్లు సమాచారం.

Read Also: KCRపై చర్యలు తీసుకోకుంటే సీఎం రాజీనామా చేయాలి: కిషన్​ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>