epaper
Wednesday, February 18, 2026
epaper

లక్ష ఇచ్చాడు.. చిక్కుల్లో పడ్డాడు

కలం, మెదక్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఇటీవల ఓ మహిళకు రూ. లక్ష ఇవ్వడంతో వివాదాస్పదంగా మారింది. సదాశివపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బండి వద్ద నిమ్మ సోడా తాగి.. ఆ మహిళకు సహాయం పేరుతో బహిరంగంగా ఏకంగా లక్ష రూపాయలను జగ్గారెడ్డి ఇచ్చాడు. అయితే, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి బహిరంగంగా విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ చేయడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని, బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డిపై సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి సదాశివపేట బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీల మల్లన్న ఫిర్యాదు చేశాడు.

ఎన్నికల కోడ్ ప్రకారం ఒక వ్యక్తి వద్ద 50 వేల కన్నా ఎక్కువగా ఉండవద్దనే నిబంధన ఉన్నది. అలాంటిది జగ్గారెడ్డి లక్షల రూపాయలు జేబుల్లో పెట్టుకొని తిరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కోడ్ అమలులో ఉండగా ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ఓపెన్ గా డబ్బులు పంపిణికి సంబంధించిన ఆధారాలు, మీడియాలో వచ్చిన వార్త కథనాలతో ఫిర్యాదు చేసిన జిల్లా ఎన్నికల అధికారి పట్టించుకోకపోవడంపై బిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళిని, నిబంధనలు ఉల్లంఘించిన (Election Code Violation) జగ్గారెడ్డి పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మొత్తానికి సహాయం చేయబోయిన జగ్గారెడ్డి.. ఎన్నికల కోడ్ చిక్కుల్లో పడిపోయారు. అయితే, అధికార పార్టీ నేత జగ్గారెడ్డి (Jagga Reddy) పై కేసు నమోదు చేస్తారా? ఏలాంటి చర్యలు తీసుకుంటారు అనే చర్చ సంగారెడ్డి జిల్లాలో నడుస్తుంది.

Read Also: బీజేపీ బీఫామ్‌లు బీఆర్ఎస్ ఆఫీసులో ఇస్తున్నారు : సీఎం రేవంత్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>