Mobile Popup Ad
Mobile Popup Ad

విజ‌య‌శాంతి రెడ్డి కుటుంబ‌ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మిదే!

క‌లం, వెబ్ డెస్క్‌: రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజ‌య‌శాంతి రెడ్డి (Vijayashanti Reddy) కుటుంబం ఆత్మ‌హ‌త్య‌ (Family Suicide)పై మిస్ట‌రీ వీడింది. ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో విచార‌ణ చేప‌ట్టి కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. విజ‌య‌శాంతి రెడ్డి డిప్రెష‌న్‌తోనే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తేల్చారు. అయితే ఆమె డిప్రెష‌న్‌లోకి వెళ్లేంత స‌మ‌స్య‌లు ఏమున్నాయ‌న్న‌ది తెలియాల్సి ఉంది. విజ‌య‌శాంతి రెడ్డి జ‌న‌వ‌రి 30న ఘ‌ట్కేస‌ర్‌, చ‌ర్లప‌ల్లి (Charlapalli) రైల్వే ట్రాక్ మ‌ధ్య‌లో కొడుకు విశాల్‌, కూతురు చైత‌న్య‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఇక బ‌త‌కాల‌ని లేద‌ని ఒక సూసైడ్ నోట్ రాసి ఆ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. మొత్తానికి తొమ్మిది రోజుల సుధీర్ఘ విచార‌ణ అనంత‌రం పోలీసులు ఆత్మ‌హ‌త్య‌కు డిప్రెష‌న్ కార‌ణ‌మ‌ని నిర్ధారించారు. ప్ర‌స్తుతం ఆమె డిప్రెష‌న్‌లోకి వెళ్ల‌డానికి గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మ‌రోవైపు విజ‌య‌శాంతి రెడ్డి అన్న చిరంజీవి రెడ్డి మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో ప‌లు యూట్యూబ్ ఛానెళ్లు, మీడియా సంస్థ‌ల‌పై ఫిర్యాదు చేశారు. త‌న చెల్లి కుటుంబం ఆత్మ‌హ‌త్య (Charlapalli Family Suicide) చేసుకోవ‌డానికి తానే కార‌ణ‌మంటూ దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఛానెళ్ల‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఆయా ఛానెళ్ల‌కు కోర్టు నుంచి నోటీసులు కూడా పంపుతున్న‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: తాయిలాలు కాదు.. మా గోస పట్టించుకోండి..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>