కలం, మెదక్ బ్యూరో: ఎన్నికలు వచ్చాయంటే డబ్బు సంచులు పట్టుకొని చాలా మంది వస్తారని, కానీ ఎప్పటికీ ప్రజల మధ్య ఉండి సేవ చేసే నాయకుడు ఎవరో గుర్తించి ప్రజలు ఓట్లు వేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక పట్టణ పరిధిలోని 6వ వార్డు చేర్వాపూర్లో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుబ్బాక ప్రాంత అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Read Also: విజయశాంతి రెడ్డి కుటుంబ ఆత్మహత్యకు కారణమిదే!
Follow Us On: Sharechat


