కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్(Nampally Forensic Lab)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 5 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. దట్టంగా పొగ కమ్ముకుంది. సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్‌లో ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటికి పరుగులు తీశారు.
అయితే ప్రమాద (Nampally Fire Accident) సమయంలో ఇద్దరు లోపలే చిక్కుకుపోయారు. వారిని వెంటనే రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఇందులో ఒకరికి గాయాలవగా ఆస్పత్రికి తరలించారు. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎన్ఏ పరీక్షలు, ఫింగర్ ప్రింట్ నిర్ధారణలు చేయడంలో ఈ ల్యాబ్‌కు మంచి పేరుంది. ఇది స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడంతో అధికారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇదే భవనంలో ఫోన్ ట్యాపింగ్‌కి (Phone Tapping) సంబంధించిన కీలక ఫైళ్లు ఉన్నట్లుగా చర్చ నడుస్తోంది. ష్టార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Read Also: లక్ష ఇచ్చాడు.. చిక్కుల్లో పడ్డాడు
Follow Us On: Youtube


