Mobile Popup Ad
Mobile Popup Ad

మా విజయం వారికి అంకితం: వైభవ్

కలం, వెబ్ డెస్క్​ : ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్ ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన తుది పోరులో 100 పరుగుల తేడాతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. టోర్నీ మొత్తంలో ఓటమి తెలియని జట్టుగా భారత్ నిలిచింది. ఫైనల్లో టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Suryavanshi) మ్యాచ్‌ను పూర్తిగా తన వైపుకు తిప్పాడు. 80 బంతుల్లో 175 పరుగులతో ఇంగ్లండ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో చేసిన ఈ ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని ముందే నిర్ణయించింది. ఈ ప్రదర్శనతో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్రలో నిలిచాడు.

టైటిల్ గెలిచిన తర్వాత వైభవ్ సూర్యవంశీ (Suryavanshi) తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గత 7 నుంచి 8 నెలల కష్టానికి ఇదే ఫలితమని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. జట్టు సపోర్ట్ స్టాఫ్ చేసిన శ్రమే ఈ విజయంలో కీలకమని చెప్పాడు. అందుకే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును వారికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. టోర్నీ మొత్తం జట్టు అనవసర ఒత్తిడికి లోనుకాలేదని వైభవ్ వివరించాడు. మొదటినుంచి సహజమైన ఆటనే ఆడాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆసియా కప్ దశ నుంచి సాగిన సుదీర్ఘ సన్నద్ధతే ఈ విజయానికి బలమైందని తెలిపారు. తన నైపుణ్యాలపై పూర్తి నమ్మకం ఉందని, పెద్ద మ్యాచ్‌లలో రాణించగలనన్న విశ్వాసమే ఫైనల్లో నిజమైందని ఆయన పేర్కొన్నట్లు వెల్లడైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>