Mobile Popup Ad
Mobile Popup Ad

వందేభారత్ రైళ్లు పేల్చేస్తాం.. ఆగంత‌కుడి సంచలన లేఖ!

క‌లం, వెబ్ డెస్క్‌: దేశంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు విమానాలు, స్కూళ్లు, కోర్టుల‌కు బాంబు బెదిరింపులు(bomb threat) రావ‌డం క‌ల‌క‌లం రేపింది. తాజాగా ఆగంత‌కులు రైళ్ల‌ను టార్గెట్‌గా చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. వందేభార‌త్(Vande Bharat) రైళ్ల‌ను పేల్చేస్తామ‌ని ఓ ఆగంత‌కుడు రైల్వే అధికారుల‌కు లేఖ రాశాడు. హైదరాబాద్‌(Hyderabad)లో ఓ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన న‌లుగురు ఉంటున్నార‌ని, ఈ న‌లుగురు రైళ్ల‌ను పేల్చేందుకు ప్లాన్ వేశార‌ని లేఖలో పేర్కొన్నాడు. హైద‌రాబాద్ నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు వందేభార‌త్ రైళ్లు వెళ్లే మార్గాల్లో బాంబులు పెట్టి 250 మందిని చంపేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లు లేఖ‌లో పేర్కొన్నారు. ఈ లేఖ ఫిబ్ర‌వ‌రి 3న పోస్టులో జీఎంకి పంపించిన‌ట్లు స‌మాచారం. దీంతో రైల్వే పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అన్ని వందేభారత్ రైళ్లలో తనిఖీలు చేపట్టారు. రైళ్లు న‌డిచే లైన్ల‌లో కూడా ముమ్మ‌రంగా త‌నిఖీలు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>