epaper
Wednesday, February 18, 2026
epaper

చిక్కుల్లో మనోజ్​ బాజ్​పేయీ మూవీ​ ​‘ఘూస్​ఖోర్​​ పండత్’

కలం, వెబ్​డెస్క్​: సత్య, ప్రేమకథ, హ్యాపీ తదితర సినిమాలతో పాటు ‘ఫ్యామిలీ మ్యాన్​’ వెబ్​సిరీస్​తో తెలుగులోనూ పాపులర్​ అయిన బాలీవుడ్​ నటుడు మనోజ్​ బాజ్​పేయీ (Manoj Bajpayee). ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్​ మూవీ ‘ఘూస్​ఖోర్​​ పండత్​​’ వివాదాల్లో చిక్కుకుంది. మూవీ టైటిల్​ తమను కించపరిచేలా ఉందంటూ ఓ సామాజిక వర్గం ఉత్తరప్రదేశ్​లో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలకు దిగింది. పోలీస్​ స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. దీంతో మూవీపై ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం ఎఫ్​ఆర్​ఐర్​ నమోదు చేసింది. ఈ క్రమంలో కేంద్రం సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో నెట్​ఫ్లిక్స్​ ఈ సినిమా టీజర్​, ప్రోమోను తొలగించింది.

అసలేమైందంటే..

మనోజ్​ బాజ్​పేయీ ప్రధాన పాత్రలో ‘ఘూస్​ఖోర్​ పండత్​’ మూవీని నెట్​ఫ్లిక్స్​ ఇండియా భాగస్వామ్యంతో ప్రొడ్యూసర్​ నీరజ్​ పాండే నిర్మిస్తున్నారు. నీరజ్​పాండేతోపాటు రితేష్​ షా డైరెక్టర్లు. ముఖ్య పాత్రల్లో నుస్రత్​ భరూచా, శ్రద్ధా దాస్​, కికు శ్రద్ధ నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్​, ప్రోమోను ఈ నెల 3న నెట్​ఫ్లిక్స్​ రిలీజ్​ చేసింది.

ఆ వెంటనే టైటిల్​పై వివాదం రాజుకుంది. ఇందులోని ‘ఘూస్​ఖోర్’ పదం పక్కన తమ సామాజిక వర్గాన్ని స్ఫురించేలా ‘పండత్’​ పదం వాడడంపై ఓ సామాజిక వర్గం మండిపడింది. మూవీపై సోషల్​ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అనంతరం ఉత్తరప్రదేశ్​ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు మొదలయ్యాయి.

రాష్ట్రంలోని అధికార బీజేపీతోపాటు బహుజన్​ సమాజ్​ వాదీ (బీఎస్​పీ) అధినేత్రి మాయావతి సైతం ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. పరిస్థితి తీవ్రత గమనించిన యూపీ ప్రభుత్వం మూవీ యాక్టర్లు, ప్రొడ్యూసర్​, డైరెక్టర్లతోపాటు నెట్​ఫ్లిక్స్​పైనా ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది. దీనిపై కేంద్రానికీ ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం వెంటనే టీజర్​, ప్రోమో తొలగించాలంటూ ఆదేశించింది. నెట్​ఫ్లిక్స్​ వెంటనే వాటిని తన ప్లాట్​ఫామ్​ నుంచి తొలగించింది.

ప్రజల మనోభావాలు గౌరవిస్తా: మనోజ్​

వివాదంపై నటుడు మనోజ్​ బాజ్​పేయీ (Manoj Bajpayee) స్పందిస్తూ ప్రజల మనోభావాలను తాను గౌరవిస్తానని చెప్పారు. ఎవరినో కించపరచాలని తాము ఈ టైటిల్​ పెట్టలేదని, తన పాత్ర స్వభావాన్ని చెప్పేలా మాత్రమే పెట్టామని ఆయన అన్నారు. ‘నటుడిగా నా బాధ్యత స్టోరీకి, పాత్రకు అనుగుణంగా నటించడం.. అంతే. నాకు సంబంధించినంత వరకు ఇది ఒక పాత్ర స్వభావాన్ని తెలిపే టైటిల్​. అంతేకానీ, ఇది ఏ సామాజిక వర్గాన్నీ కించపరిచేది కాదు. అయితే, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినందువల్ల, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ సినిమా టీజర్​, ప్రోమోను తొలగించాలని నిర్ణయించడం సంతోషకరం’ అని మనోజ్​ అన్నారు.

‘ఇదొక కల్పిత పోలీస్​ స్టోరీ. ఇందులో అతని స్వభావాన్ని తెలిపేలా పెట్టిన టైటిల్​. ఇది ఏ మతాన్నీ, వర్గాన్నీ కించపర్చాలని పెట్టింది కాదు. అయితే, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం మా బాధ్యత’ అని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>