సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Saudi Road Accident)లో హైదరాబాద్ కు చెందిన 18 మంది మృతి చెందినట్టు అధికారులు నిర్ధారించారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో బస్సు పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన 18 మంది హైదరాబాద్‌లోని మల్లేపల్లి బజార్‌ఘాట్ ప్రాంతానికి చెందినవారి గా గుర్తించారు. వీరంతా ఒకే గ్రూప్‌గా ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Saudi Road Accident | మృతి చెందిన వారిని రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూర్, మహ్మద్ అలీతో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్లు గుర్తించారు. మెహదీపట్నంలోని ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా వీరు ఉమ్రా టూర్ టికెట్లు బుక్ చేసుకున్నారు. నవంబర్ 9న హైదరాబాద్ నుండి బయల్దేరిన యాత్రికులు మక్కాలో ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. తరువాత మదీనాకు ప్రస్థానమయ్యేటప్పుడు ఈ ఘోర ప్రమాదం జరిగింది.
Read Also: ఐబొమ్మ వివాదం.. మీమర్స్‌కు సజ్జనార్ వార్నింగ్..
Follow Us on : Pinterest

