కలం, వెబ్ డెస్క్: ఏపీలోని తూర్పుగోదావరి (East Godavari) జిల్లా రాయవరం మండలం కూర్మాపురం (Kurmapuram) గ్రామంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. పంట పొలాల నుంచి జనావాసాల్లోకి ప్రవేశించిన పులి ఒక పూరిపాకలోకి వెళ్లడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో గ్రామస్తులు ఇళ్లపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతుండగా, పోలీసులు సైతం చేతిలో కర్రలతో అప్రమత్తమయ్యారు.
పరిస్థితిని సమీక్షించిన అధికారులు పులి (Leopard)ని బంధించేందుకు గట్టి చర్యలు చేపట్టారు. పులికి మత్తు మందు ఇచ్చి పట్టుకునేందుకు పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మత్తు ఇంజక్షన్ గన్తో రంగంలోకి దిగింది. స్థానిక రైతులు, పోలీసులు సమన్వయంతో పులిని బంధించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పెద్ద పులి సంచారంతో గ్రామంలో హైటెన్షన్ నెలకొంది.
Read Also: ఏపీలో జంగిల్ రాజ్ పాలన : వైఎస్ జగన్
Follow Us On: X(Twitter)


