సోషల్ మీడియా మీమర్స్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్(Sajjanar) వార్నింగ్ ఇచ్చారు. ఐబొమ్మ రవి విషయంపై సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్‌ను ఆయన ఖండించారు. ఇటువంటి పైరసీ సైట్‌లను ప్రోత్సహిస్తే అది ప్రజలకే నష్టం చేస్తుందన్నారు. రవి పైరసీ పేరుతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను భారీగా ప్రచారం చేసినట్టు స్పష్టమైందని చెప్పారు. కొత్తగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఇమ్మడి రవి(Immadi Ravi)ని పట్టుకున్న తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో పోలీసులపై మీమ్స్ చేయడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి కార్యకలాపాలపై కూడా నిఘా ఉంటుందని హెచ్చరించారు. “ఫ్రీగా సినిమాలు వస్తున్నాయి” అని ఐ బొమ్మ వంటి సైట్లను ప్రోత్సహించడం వల్ల ప్రజల వ్యక్తిగత డేటా మొత్తం హ్యాకర్ల చేతిలో పడిపోయిందని, ఆ విషయాన్ని చాలామంది గుర్తించలేదని Sajjanar అన్నారు.
Read Also: నా ఫ్యామిలీ మెంబర్‌కు సైబర్ షాక్ : అక్కినేని నాగార్జున
Follow Us on : Pinterest

