కలం, వెబ్ డెస్క్: బంగారం, వెండి ధరలు(Gold Silver Prices) కొద్దిరోజుల నుంచి వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల సీజన్(Wedding Season) వేళ కొనుగోళ్లకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. తాజాగా శుక్రవారం కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర(Silver Price) గురువారం రూ.3,00,000 ఉండగా శుక్రవారం ఉదయం రూ.20,000 తగ్గి రూ.2,80,000గా ఉంది. ఇక బంగారం విషయానికొస్తే… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Price) గురువారం రూ.1,54,420 ఉండగా శుక్రవారం ఉదయం రూ.2,070 తగ్గి ప్రస్తుతం రూ.1,52,350గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.1,41,550 ఉండగా శుక్రవారం ఉదయం రూ.1,900 తగ్గి ప్రస్తుతం రూ.1,39,650గా ఉంది.


