కలం మెదక్ బ్యూరో : తాగిన మైకంలో కన్న తండ్రిపై దాడిచేసి చంపిన సంఘటన మెదక్ (Medak) జిల్లాలో చోటుచేసుకుంది. రేగోడు మండల కేంద్రానికి చెందిన తండ్రి నల్లమల్లిగడ్డ శాకీర్తో కొడుకు మహమ్మద్ (22) రాత్రి తాగి వచ్చి గొడవకు దిగాడు. మద్యం మత్తులో కొడుకు విచక్షణారహితంగా కొట్టడంతో, తీవ్రంగా గాయపడిన తండ్రి శాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


