కలం, వెబ్ డెస్క్ : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు (Medaram Jatara) సంబంధించిన కానుకల హూండీల లెక్కింపు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. హనుమకొండ (Hanumakonda) లోని టీటీడీ కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. దేవాదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో హూండీల లెక్కింపు సాగుతోంది. లెక్కింపులో భాగంగా మొదటి రోజు మొత్తం 125 హూండీలను తెరిచి పరిశీలించగా, వాటి ద్వారా రూ.2 కోట్ల 49 లక్షల 65 వేల ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు.
భక్తులు సమర్పించిన నగదు కానుకలతో పాటు బంగారం, వెండి ఆభరణాలను వేర్వేరుగా విభజించి ప్రత్యేక ఇనుప హూండీల్లో భద్రపరచినట్లు తెలిపారు. వాటికి తాళాలు వేసి భద్రంగా ఉంచినట్లు అధికారులు స్పష్టం చేశారు. హూండీల లెక్కింపు ప్రక్రియను పూర్తిస్థాయి భద్రతా చర్యలతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని హూండీలను తెరిచి లెక్కింపు కొనసాగిస్తామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
Read Also: యూరియా యాప్ రద్దు చేయాలి.. పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన
Follow Us On: X(Twitter)


