హైదరాబాద్‌కు చెందిన యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్(Dhanush Srikanth).. టోక్యోలో జరుగుతున్న డెఫ్ ఛాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అతను అగ్రస్థానాన్ని సాధించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఫైనల్ రౌండ్‌లో శ్రీకాంత్ 252.2 పాయింట్లను నమోదు చేసి మొదటి స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు, ఈ విభాగంలో డెఫ్లింపిక్స్(Deaflympics) చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన షూటర్‌గా కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే ఈ షూటర్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంది.
డెఫ్లింపిక్స్‌లో ధనుష్ శ్రీకాంత్(Dhanush Srikanth) సాధించిన ఈ గర్వకారణ విజయాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వం అతనికి విశేష బహుమతి ప్రకటించింది. రాష్ట్ర క్రీడా విధానం ప్రకారం రూ. 1 కోటి 20 లక్షల ప్రోత్సాహకాన్ని అందజేస్తామని క్రీడామంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నవంబర్ 16న హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే సూరత్ నుండి పోటీపడ్డ మహ్మద్ వానియా 250.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు. అందువల్ల ఈ ఈవెంట్‌లో బంగారం–వెండి రెండు పతకాలు భారత షూటర్ల ఖాతాలో చేరాయి.
Read Also: ‘కర్మ హిట్స్ బ్యాక్’ విమర్శ.. ఎవరికో చెప్పిన కవిత
Follow Us on: Youtube

