epaper
Wednesday, February 18, 2026
epaper

కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయాలు తప్ప అభివృద్ధి లేదు : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో : రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయాలు, కక్ష్య సాధింపు చర్యలు తప్ప.. ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టింపు లేదని దుబ్బాక (Dubbak) ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotha Prabhakar Reddy) ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేకులకుంటలో ఎమ్మెల్యే ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దుబ్బాక ప్రాంతం అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నా దుబ్బాక మున్సిపాలిటీకి ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని.. అభివృద్ధి జరగాలంటే దుబ్బాక మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.

Read Also: 17 ఏళ్లుగా ఏం చేశారు..? కేటీఆర్‌ను నిలదీసిన సిరిసిల్ల ప్రజలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>