epaper
Wednesday, February 18, 2026
epaper

ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విధులలో నిమగ్నం అయి ఉన్న ఉద్యోగులు పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Nizamabad Collector) సూచించారు. దీనికి వీలుగా కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయాలలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Corporation) పరిధిలో ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు ఐడీఓసీ (కలెక్టరేట్)లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.

అదేవిధంగా బోధన్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు బోధన్ మున్సిపల్ కార్యాలయంలో, ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో, భీంగల్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ నెల 07, 08 తేదీలలో ఆయా కార్యాలయాల పని వేళల్లో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని, ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఈ నెల 08న పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకోవచ్చని కలెక్టర్ (Nizamabad Collector) తెలిపారు.

Read Also: ఇవి కార్యకర్తల ఎన్నికలు : రేవంత్​ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>