epaper
Wednesday, February 18, 2026
epaper

ఫోన్ ట్యాపింగ్​ కేసులో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ఒప్పందం : కిషన్​ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​ :​ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో రెండేళ్లుగా హడావిడి చేశారన్నారని కాంగ్రెస్​ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి (Kishan Reddy) విమర్శలు చేశారు. ఇన్ని రోజులు గడిచినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఓ డీఎస్పీని సీఐ గా డిమొట్ చేసిన గొప్పకార్యం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న చర్య ఇదొక్కటేనని ఆయన ఆరోపించారు.

బీఆర్ఎస్​, కాంగ్రెస్ లు ఒకటేనని చెప్పారు. బీఆర్​ఎస్​ అవినీతిని బయటపడతామని కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల ముందు చెప్పిందని, కానీ అలాంటి చర్యలు ఏం తీసుకోలేదన్నారు. దీనికి కారణం ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. రాహుల్​ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో కేసీఆర్​ కు ఒప్పందం కుదిరినందునే బీఆర్​ఎస్​ వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోరని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగానా తెలంగాణ రాష్ట్రం నుంచే డబ్బులు వెళ్తున్నట్లు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ కు తెలంగాణ బంగారు బాతుగా మారిందన్నారు కిషన్​ రెడ్డి.

Read Also: పాక్ జట్టుకు అసలు బలం అదే: అశ్విన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>