epaper
Wednesday, February 18, 2026
epaper

నటి జయవాహిని కన్నుమూత.. ఆ వ్యాధితోనే మృతి..!

క‌లం, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ నటి జయవాహిని (Jayavahini) బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. కొంత‌కాలంగా ఆమె క్యాన్స‌ర్‌(Cancer)తో బాధ‌ప‌డుతున్నారు. ఆమె ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో హైద‌రాబాద్‌లోని మణికొండలో ఉన్న‌ తన నివాసం నుంచి ఇటీవల విజయనగరం తీసుకెళ్లారు. సొంత ఊరిలోనే జయవాహిని క‌న్నుమూశారు. జయవాహిని ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలు పోషించారు. ఈ క్ర‌మంలో చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే కొన్నేళ్లుగా ఆమె సినిమాలు, సీరియ‌ళ్ల‌కు కూడా దూర‌మ‌య్యారు. జ‌య‌వాహిని మృతితో సినీ ప‌రిశ్ర‌మ‌లోని ఆమె సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>