హైకోర్ట్‌లో గ్రూప్-1 అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణలో గ్రూప్-1(Telangana Group 1) నియామ‌కాల‌పై హైకోర్ట్(High Court) కీల‌క తీర్పు వెలువ‌రించింది. గతంలో సింగిల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. గ‌తంలో గ్రూప్-1 జ‌నరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను సింగిల్ బెంచ్ రద్దు చేసింది. మరోసారి పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాలని ప్రకటించింది. దీంతో ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు, టీజీపీఎస్సీ హైకోర్ట్ డివిజ‌న్ బెంచ్‌లో సింగిల్ బెంచ్ తీర్పును స‌వాల్ చేశారు. దీనిపై గురువారం విచార‌ణ చేప‌ట్టిన డివిజన్ బెంచ్ ఆ సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసింది. పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో గ్రూప్-1 పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల‌కు ఊర‌ట క‌లిగింది. ఇప్ప‌టికే 562 మంది అభ్య‌ర్థుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నియామ‌క ప‌త్రాలు అంద‌జేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>