కలం, డెస్క్ : ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. మిర్యాలగూడ సభలో సీఎం మాట్లాడుతూ.. ’మిర్యాల గూడకు 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే సరిపోతలేవని ఇంకో 3వేల ఇండ్లు కావాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అంటున్నారు. మిర్యాల గూడలోనే కాదు అన్ని నియోజకవర్గాల్లో ఇవే విజ్ఞప్తులు వస్తున్నాయి. కాబట్టి ఏప్రిల్ లో పెట్టే బడ్జెట్ లో కొత్తగా లక్షల ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం. నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఆత్మగౌరవంతో బతికేలా చేస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని.. ఇందులో దళారులు లేకుండా ఇందిరమ్మ లబ్దిదారులకు నేరుగా బ్యాంకు అకౌంట్ లోనే డబ్బులు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు అంటూ ఊరించారని.. కానీ ఎవరికీ సరిగ్గా ఇవ్వకుండా మోసం చేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. కానీ తాము మాత్రం కక్ష సాధింపులకు పోకుండా అన్ని పార్టీలకు చెందిన వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు సీఎం రేవంత్ (Revanth Reddy) వెల్లడించారు.
Read Also: బాబాయ్ కోసం తగ్గిన అబ్బాయ్.. రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ ఇదే!
Follow Us On: Sharechat


