కలం, నల్లగొండ బ్యూరో : చౌటుప్పల్ (Choutuppal) మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) సూసైడ్ కలకలం రేగింది. నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి 17వ వార్డు అభ్యర్థిగా పస్తం మల్లమ్మ నామినేషన్ వేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఆశావాహ అభ్యర్థిగా ఉమా మహేశ్వరి నామినేషన్ వేశారు. కానీ నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఉమామహేశ్వరికి కాంగ్రెస్ నుంచి టికెట్ కన్‌ఫర్మ్ కావడంతో పస్తం మల్లమ్మ విత్ డ్రా చేసుకున్నారు.
దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమా మహేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆ వార్డు ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘ఏకగ్రీవం మాకొద్దు.. మా వార్డుకు ఎన్నికలు జరపాలి’ అంటూ చౌటుప్పల్ మున్సిపాలిటీ (Choutuppal Municipality) ఎదుట ఆందోళనకు దిగారు. ఇదిలావుంటే.. విత్ డ్రా చేసుకున్న మల్లమ్మపై వార్డులోని ఓటర్లు ఆరోపణలు చేశారు. డబ్బులు తీసుకుని నామినేషన్ ను విత్ డ్రా చేకుందని మల్లమ్మపై వార్డు ప్రజలు మండిపడ్డారు. దీంతో మనస్థాపం చెందిన మల్లమ్మ తన ఇంట్లో ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు డోర్ పగలగొట్టి ఆమెను రక్షించారు. నామినేషన్ విత్ డ్రా చేసుకునేందుకు డబ్బులు తీసుకో లేదని చెబుతున్నా.. తనను మానసికంగా హింసిస్తున్నారని మల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: తెలంగాణకు కేసీఆర్ జాతిపిత కాదు : మంత్రి కోమటిరెడ్డి
Follow Us On : WhatsApp


