కలం, నల్లగొండ బ్యూరో : మిర్యాలగూడలో (Miryalaguda) ఫోన్ పే బ్యాచ్ తయారయ్యిందని, వారు తనతో పాటు తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Laxma Reddy) మండిపడ్డారు. మిర్యాలగూడలోని గూడూరు వద్ద నిర్వహించిన సీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో తన కుటుంబంలోని ముగ్గురు సభ్యులు నామినేషన్ వేశారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేశారని తెలిపారు.
కానీ బీఆర్ఎస్ లీడర్లు బెదిరించడంతో ఆ వార్డుల్లో పోటీ చేసేందుకు ఎవ్వరూ సుముఖత చూపకపోవడంతో.. తన కుటుంబ సభ్యులని బరిలోకి దించి ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ పలు అభివృద్ది పనులకు నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే బీఎల్ఆర్ (MLA Bathula) కోరారు.
Read Also: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురే లేదు : సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)


