epaper
Wednesday, February 18, 2026
epaper

కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై ధోనీ ఏమన్నాడంటే..!

కలం, వెబ్ డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2027లో కోహ్లీ (Kohli), రోహిత్ (Rohit) ఆడతారా? అన్నది ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. వారికి అవకాశం ఇవ్వకపోవచ్చన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రోహిత్, కోహ్లీ భవితవ్యంపై కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (Dhoni)  స్పందించారు. ఆటకి వయసుకు సంబంధం లేదని, ఫిట్‌గా ఉంటే ఎంతకాలమయినా ఆడొచ్చని వివరించాడు ధోనీ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై వయసును ప్రమాణంగా చూడొద్దని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిట్‌నెస్, ఫామ్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగవచ్చని ధోనీ తెలిపారు. 35 ఏళ్ల ఆటగాడు 22 ఏళ్ల ఆటగాడికంటే ఫిట్‌గా ఉంటే అతడే జట్టుకు సరైన ఎంపిక అని పేర్కొన్నారు.

జట్టు ఎంపికలో అందరికీ ఒకే ప్రమాణం ఉండాలని ధోనీ (Dhoni) సూచించారు. వయసు కాకుండా ప్రదర్శన, ఫిట్‌నెస్ మాత్రమే చూడాలన్నారు. ఈ వ్యాఖ్యలు టీమిండియా సెలెక్షన్ విధానంపై పరోక్ష సంకేతంగా మారాయి. అనుభవం మ్యాచ్‌ల సంఖ్యతో రాదని ధోనీ స్పష్టం చేశారు. ఒత్తిడిలో ఆడినప్పుడే నిజమైన అనుభవం వస్తుందని చెప్పారు. ముఖ్యంగా డెత్ ఓవర్లు, లోయర్ ఆర్డర్ పాత్రల్లో అనుభవం కీలకమని వివరించారు. చివరగా, జట్టులో కొనసాగాలంటే ఫామ్, ఫిట్‌నెస్ తప్పనిసరని ధోనీ అభిప్రాయపడ్డారు. ఈ రెండూ ఉంటే వయసు ఎప్పటికీ అడ్డంకి కాదని స్పష్టం చేశారు.

Read Also: పాకిస్థాన్ బాయ్‌కాట్‌పై గంభీర్ రియాక్షన్ ఇదే..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>