కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ నేతలపై జరుగుతున్న దాడుల అంశంపై వైఎస్సార్‌సీపీ (YSRCP) ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ను ఆశ్రయించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై విచారణ చేపట్టాలని కోరుతూ వారు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని.. ప్రజాస్వామ్య హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ దాడులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని ఆరోపించారు. ఈ అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తక్షణమే స్పందించి, స్వతంత్ర విచారణ జరిపించాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు (YSRCP MPs) డిమాండ్ చేశారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపుతో జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని వారు కోరారు.
Read Also: చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ
Follow Us On: Youtube


