స్పీక‌ర్‌కు ఆధారాలు క‌నిపించ‌డం లేదా?: జ‌గ‌దీష్ రెడ్డి

క‌లం, వెబ్ డెస్క్‌: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ (Prasad Kumar) చ‌ట్ట‌ప‌రంగా వ్య‌వ‌హరించ‌డం లేద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి (Jagadish Reddy) ఆరోపించారు. జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ (Sanjay Kumar) అన‌ర్హ‌త పిటిష‌న్‌ను కొట్టివేస్తూ స్పీక‌ర్ తీర్పునిచ్చిన నేప‌థ్యంలో జ‌గ‌దీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్పీకర్ చట్ట ప్రకారం పని చేసే పరిస్థితిలో లేడ‌ని విమ‌ర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ సమావేశాలు, ప్రచారాల్లో పాల్గొన్నార‌ని, ఆ ఆధారాలన్నీస్పీకర్‌కు సమర్పించామ‌ని తెలిపారు. ఆ ఆధారాలేవీ స్పీక‌ర్‌ ప్రసాద్ కుమార్‌కు కనపడలేదా అని ప్ర‌శ్నించారు. అన్ని ఆధారాలు స‌మ‌ర్పించినా కూడా స్పీకర్ అన‌ర్హ‌త‌ పిటిషన్‌ను డిస్మిస్ చేయడం దురదృష్టకర‌మ‌న్నారు. స్పీక‌ర్ నిర్ణయంపై కోర్టుల్లోనే తేల్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

స్పీక‌ర్ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఆయ‌న ఆత్మ‌సాక్షిగా ప‌ని చేసే ప‌రిస్థితుల్లో లేర‌న్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నార‌ని, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో, హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఏఐసీసీ స‌భ‌ల్లో కూడా కాంగ్రెస్ త‌ర‌ఫున పాల్గొన్నార‌ని తెలిపారు. కాంగ్రెస్ జెండా వేసుకొని తిరుగుతున్నార‌ని స్పీక‌ర్‌కు చెప్పినా ఆయ‌నకు క‌నిపించ‌డం లేద‌న్నారు. గ‌త వారం రోజులుగా ప్ర‌తి రోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎవ్వ‌రికీ చ‌ట్టంపై గౌర‌వం లేద‌న్నారు. స్పీక‌ర్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు.

 Read Also: సీఎం బినామీ కంపెనీకి వేల కోట్లు: కేటీఆర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>